జాతీయ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమర్షియల్ సినిమాల గురించి ప్రస్తావించిన శృతి హాసన్.. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే తీద్దామని చెప్పే వ్యక్తుల మాటలు తాను విననని అన్నారు. కొన్ని బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించానని, కానీ వాటిని గొప్పగా ఆస్వాదించలేదని కూడా చెప్పారు. ఇంకా ఉత్తమమైన కంటెంట్‌ను ఎంచుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఆమె కెరీర్లో హిట్లుగా నిలిచిన ‘గబ్బర్ సింగ్’, ‘రేసు గుర్రం’ సినిమాల గురించి ఇలా మాట్లాడారని అపార్థం చేసుకుని కొన్ని వెబ్సైట్లు వార్తలు వండి వార్చాయి. దీంతో శృతిపై ట్రోలింగ్ మొదలైంది.