ఖలేజా సినిమా పై హర్ష వర్దన్ కామెంట్స్ చేసాడు. ఆయన మాట్లాడుతూ…”త్రివిక్రమ్ గారు పంచ్ డైలాగ్స్ లేకుండా రాసిన ‘ఖలేజా’ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. ఆ చిత్రం ఆడకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ సినిమాలో మహేష్ బాబు నటన చాలా గొప్పగా ఉంటుంది.అందులోని డైలాగ్స్ అన్నీ మహేష్ గారి పాత్ర నుండీ పుట్టుకొచ్చినవే. ఆ చిత్రంలో చిన్న చిన్న డైలాగ్స్ తో సీన్స్ ను పండించిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం. పాత్రల స్వభావం నుంచి డైలాగ్స్ రావడం వల్లనే అవి అంతగా పేలాయి. ఎక్కువగా ఆ చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.ఇప్పటికీ ఆ సినిమాకి చాలా మంది అభిమానులు వున్నారు. ” అంటూ చెప్పుకొచ్చాడు హర్షవర్దన్.