అల వైకుంఠపురంలో సినిమాతో సుశాంత్ కి మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్. దర్శన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్‌ను ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో సోమవారం పునఃప్రారంభమైంది. ప్రస్తుతం హీరో హీరోయిన్లు సుశాంత్, మీనాక్షి చౌధరి లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ పాటను శ్రీనివాసమౌళి రచించారు. కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది.