టీజర్ లో 1.18 మినిట్స్ దగ్గర రాయల్ ఎన్ ఫీల్డ్ రైజ్ చేస్తున్న షాట్ చూపించారు. రాజమౌళిని ట్రోల్ చెయ్యడానికి రీజన్ అదే. స్వాతంత్య్రం రావడానికి ముందు కాలం నాటి కథతో ‘ఆర్ఆర్ఆర్’ను తీస్తున్నారు. అప్పట్లో సెల్ఫ్ స్టార్ బైక్స్ ఎక్కడ వున్నాయని ట్రోల్ చెయ్యడం స్టార్ట్ చేశారు. ఇదీ లాజిక్కే. ఆ చిన్న లాజిక్ రాజమౌళి ఎలా మిస్ అయ్యారో మరి? రాజమౌళికి ట్రోల్స్ పేస్ చెయ్యడం కొత్త కాదు. ‘మగధీర’ టైమ్ నుండి ఆయన మీద విమర్శలు వస్తున్నాయి.