పుష్ప షూటింగ్ కేరళలో ప్లాన్ చేసారు. అయితే మొదటి కరోనా కేసు అక్కడే నమోదయ్యింది కాబట్టి.. అలాగే కరోనా విజృంభణ అక్కడ ఊపందుకుంది కాబట్టి అక్కడ క్యాన్సిల్ చేసి … వికారాబాద్ , రంపచోడవరం వంటి లొకేషన్లలో ప్లాన్ చేశారు. తరువాత ఇక్కడ కూడా కరోనా తాకిడి ఎక్కువవ్వడం అలాగే లాక్ డౌన్ కూడా మొదలవ్వడంతో ఇక్కడ కూడా షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. సరే కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ కేరళ వెళదాం అనుకుంటే.. ఈమధ్య అక్కడ కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. దీంతో ‘పుష్ప’ టీం అయోమయంలో ఉన్నట్టు తెలుస్తుంది.