నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. షూటింగ్‌ను జరుపుతూనే మరోవైపు టీజర్‌ను సిద్ధంచేసే పనిలో చిత్రబృందం బిజీగా ఉన్నట్లు తెలిసింది.నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి నాగ్అశ్విన్ బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ 'కరోనా వల్ల షూటింగ్ ప్రారంభం కావడానికి చాలా సమయం పట్టనుంది. అందువల్లే సినిమా గురించి ఎక్కువగా చెప్పలేకపోతున్నా. కానీ ప్రభాస్ పుట్టినరోజుకు ముందే కిల్లర్ అప్డేట్ను అభిమానులకు అందించబోతున్నాం' అని తెలిపారు