సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తికి బెయిల్ ఇచ్చే సందర్భంలో బాంబే హై కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రతిలోని కొన్ని అంశాలు నిజంగా రియాపై జాలిని కలిగిస్తాయి. ఆ తీర్పులో ఏముందంటే.. 'రియా దగ్గర ఎలాంటి డ్రగ్స్ పట్టుబడలేదు, ఆమె డ్రగ్స్ సప్లై ముఠాలో సభ్యురాలు కాదు, డ్రగ్స్ లావాదేవీల్లో ఆమెకు ఎలాంటి లాభం కలిగినట్టు తేలలేదు... అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ ద్వారా తేలింది. సుశాంత్ డబ్బుతో ఆమె డ్రగ్స్ కొనుగోలు చేసిందనే వాదనను సమర్థించలేం...' అని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.