పెళ్ళైన తరువాత సమంత తన స్టార్ డం ను పెంచుకుంది. అలాగే కాజల్ కూడా పెళ్ళైన తరువాత రాణిస్తుందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. ఎందుకంటే సమంత .. హీరోనే పెళ్లి చేసుకుంది. పైగా ఆమెకు అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. సమంత కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలను చేస్తుంది. అయితే కాజల్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆమె బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోబోతుంది. ఇప్పటి వరకూ బిజినెస్మెన్ ను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు చాలా వరకూ సినిమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకూ గ్లామర్ తోనే కాజల్ నెట్టుకొచ్చింది. ఆమె మంచి నటి అనేలా మంచి సినిమా పడలేదు.