ఈ దసరాకు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా లాంఛ్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు హారిక-హాసిని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఏర్పాట్లు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ చేతిలో 2-3 సినిమాలున్నాయి. కానీ ఆర్ఆర్ఆర్ ఓ కొలిక్కి వచ్చేంత వరకు ఏ ప్రాజెక్టూ అధికారికంగా ప్రకటించకూడదని ఊరుకున్నాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పై ఓ స్పష్టత రావడంతో.. తారక్ కూడా త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాకు కొబ్బరికాయ కొట్టాలని అనుకుంటున్నాడు.