ప్రస్తుతం స్నేహ ఉల్లాల్  ‘ఎక్స్ పైరీ డేట్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. దీని ప్రమోషన్లలో భాగంగా ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘ఈమెను ఐశ్వర్య రాయ్ తో పోల్చొద్దు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. “ఐశ్వర్య రాయ్ వర్క్ , ఆమె సాధించిన విజయాలు నాకు ఇన్స్పిరేషన్. కానీ ఆవిడతో నన్ను పోల్చడం నాకు అస్సలు ఇష్టముండదు.ఎందుకంటే.. నాకంటూ ఓ గుర్తింపు ఉంది. కానీ నేను ఆమెతోనే నన్ను పోలుస్తుంటారు. అలా కంపేర్ చెయ్యొద్దు అని చాలా సార్లు చెప్పాను. అయినా ఆమెలా కనిపిస్తున్నాను అంటే.. నేనేమి చెయ్యగలను..? నా లుక్ ను నేను ఎలా మార్చుకోగలను..? నాకు నా వర్క్… నేను ఏమి సాధించాను అన్నదే చెక్ చేసుకుంటూ ఉంటాను. నేను సాధించాల్సింది చాలా ఉంది. ఐశ్వర్య రాయ్ సాధించినంత నేను ఏమి సాధించలేదు. ఓ వేడుకలో నేను ఐశ్వర్య రాయ్ ను కలిసాను. ఆమె నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అది చాలు.. నాకు చాలా హ్యాపీగా అనిపించింది” అంటూ స్నేహ ఉల్లాల్ చెప్పుకొచ్చింది.