ఒరేయ్ బుజ్జిగా’ చిత్రీకరణ తుది దశలో ఉండగా.. ఆ చిత్రం దర్శకుడు కొండా విజయ్ కుమార్ తో మరో చిత్రం చెయ్యడానికి ఓకే చెప్పేశాడట హీరో రాజ్ తరుణ్. ఓ ఎన్నారై నిర్మాత ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి ముందుకు వచ్చాడట. అంతేకాదు షూటింగ్ కూడా మొదలుపెట్టేసారు. అయితే ఇప్పుడు ‘ఒరేయ్ బుజ్జిగా’ ఫలితం తేడా కొట్టింది. దాంతో రాజ్ తరుణ్- కొండా విజయ్ కుమార్ ల కొత్త సినిమా నిర్మిస్తున్న నిర్మాత టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. ఇది కేవలం రాజ్ తరుణ్ తొందర పాటు వల్లే జరిగిందని అతను భావిస్తున్నట్టు కూడా ఇన్సైడ్ టాక్.