హీరోయిన్  రుహాని శర్మ గోవాలో ఎంజాయ్ చేస్తోంది. ఫ్రెండ్ నటాషా సింగ్ తో కలిసి బీచ్ సిటీకి వెళ్ళింది. అక్కడ ఫ్రెండ్ తో కలిసి చక్కర్లు కొడుతోంది. లాక్డౌన్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హోమ్ టౌన్ మండిలో రుహాని శర్మ వున్నది. అన్ లాక్ మొదలైన తరువాత హైదరాబాద్ వచ్చింది. అవసరాల శ్రీనివాస్ సరసన నటిస్తున్న ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా షూట్ చేసింది. ఇక్కడి నుండి గోవా వెళ్ళిందట. లాంగ్ గ్యాప్ తరువాత హాలిడే ట్రిప్ వేసింది.