త్రివిక్రమ్ ఇప్పుడున్న రేంజ్‌కి అతడిని లాక్ చేయడానికి మహేష్ తెలివిగా వ్యవహరించాడు.ఖలేజా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఆనందాన్ని వెలిబుచ్చుతూ త్రివిక్రమ్‌తో అతి త్వరలో సినిమా వుంటుందని ప్రకటించాడు. దీంతో అధికారికంగా త్రివిక్రమ్ ఈ సినిమాకు లాక్ అయినట్టయింది. ఎన్టీఆర్‌తో సినిమా ముందు చేస్తాడో, తర్వాత చేస్తాడో తెలియదు కానీ ఇతర కమిట్మెంట్స్ ఏమీ లేకుండా త్రివిక్రమ్ తన సినిమాకు కట్టుబడేలా మహేష్ ఈ ప్రకటన ఇచ్చాడు. ఈ దెబ్బతో మహేష్.. త్రివిక్రమ్ ని ఇరకాటంలో పడేసాడని..దీనితో త్రివిక్రమ్ ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడని టాలీవుడ్ ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.