ఆన్ లైన్ వేధింపులపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయంపై ఇటీవలే హైదరాబాద్ పోలీసులు ఎన్టీఆర్ తో ఓ వీడియో చేయించారు. ఈ సమస్య ఏపీలో కూడా ఉన్నప్పుడు.. ఏపీ పోలీస్ కూడా ఇలా సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తే బాగుంటుంది కదా అనే వాదన కూడా ఉంది. ఏపీ పోలీసులు అప్రోచ్ అయితే సెలబ్రిటీలు కూడా ఉత్సాహంగా తమ సందేశాన్ని వినిపించడానికి ముందుకొస్తారని అంటున్నాయి సినీ వర్గాలు.