కన్నడ హీరోయిన్ సంజన.. డ్రగ్స్ కేసులో పోలీసు కస్టడీలో ఉంది. కస్టడీలో ఆమె చెబుతున్న వివరాలు వింటుంటే పోలీసులే షాకవుతున్నారట. ముఖ్యంగా సినీ, రాజకీయ వర్గాలకు చెందిన సెలబ్రిటీలకు సంజన డ్రగ్స్ సరఫరా చేసిందనే ఆరోపణలున్నాయి. ఆయా సెలబ్రిటీలకు తెలియకుండా వారి పిల్లలకు కూడా సంజన డ్రగ్స్ సరఫరా చేసి ఉంటుందనే వార్తలు ఇప్పుడు మరింత కలకలం రేపాయి.