హీరో నానితో గతంలో భలే భలే మగాడివోయ్ సినిమా తీశాడు దర్శకుడు మారుతి. ఆ సినిమా రిలీజ్ టైమ్ లో వచ్చిన రెస్పాన్స్ చూసి, దానికి సీక్వెన్స్ తీయాలని అనుకున్నారట. మతిమరుపు నాని క్యారెక్టర్ ని మరింత పొడిగించి, పెళ్లయిన తర్వాత నాని పడే ఇబ్బందులతో పార్ట్-2 చేద్దామని దర్శకుడు మారుతి కూడా ఓ ప్లాన్ వేసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలెక్కలేదు. హీరో నాని, దర్శకుడు మారుతి.. ఇద్దరికీ ఆ సినిమా చేయాలని ఉన్నా కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిందట.