అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో హిట్ తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. మొదట అనుకొన్న ప్రకారం కేరళలోనే  ఈ సినిమా షూటింగ్ చేయడానికి యూనిట్ సిద్ధమైంది.   అయితే ఇప్పటికీ కేరళలో కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉండడంతో చివరి క్షణంలో వెనక్కి తగ్గి. రంపచోడవరం వెళ్లడానికి దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు రంపచోడవరం, మారేడిమిల్లి అడవుల్లో యాక్షన్ పార్ట్‌తో పాటు హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనుంది చిత్రబృందం.