సోషల్ మీడియా తో తస్మాత్ జాగ్రత్త అంటూ..... వీడియో తో మన ముందుకు వచ్చారు జూనియర్ ఎన్టీఆర్.. ప్రజలు తమ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా వేదికపై రివీల్ చేయడం సమస్యలకు దారితీస్తుందని ఈ వీడియో ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రూపొందించిన ఈ వీడియోలో మెరిసి ప్రజలను అప్రమత్తం చేశారు ఎన్టీఆర్.