రమ్యకృష్ణ షూటింగ్లో పాల్గొనే ఒక్కో రోజుకు రూ.10 లక్షల చొప్పున తీసుకుంటుందట. ఈమె 10రోజులు కనుక షూటింగ్లో పాల్గొంటే 1కోటి రూపాయలు వరకూ అందుకుంటుందన్న మాట. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ అలాగే సాయి తేజ్ ల కొత్త చిత్రాల్లో నటిస్తుంది. ఆ సినిమాలకు కూడా ఈమె అదే స్థాయిలో పారితోషికం అందుకుంటుందట. స్టార్ హీరోయిన్లైన పూజ హెగ్డే, రష్మిక , కీర్తి సురేష్ వంటి వారు రూ.1.5 కోట్ల నుండీ రూ.2కోట్ల వరకూ పారితోషికం అందుకుంటున్నారు. ఇక కుర్ర హీరోయిన్లైన రాశీ ఖన్నా, నిధి అగర్వాల్, నభా నటేష్ వంటి వారు 0.60 కోట్ల వరకూ అందుకుంటున్నారు. ఆ రకంగా చూస్తే రమ్య కృష్ణ .. కుర్ర హీరోయిన్లను మించే పారితోషికం తీసుకుంటుందన్న మాట.