కరోనా వల్ల విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమా షెడ్యూల్స్ అన్నీ తారుమారు అయిపోయాయి. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అనుకున్న విధంగా ఇండియాలో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేయడం కష్టంగా మారింది. ఎందుకంటే ఫారిన్ ఫైటర్స్ కావాలి, వారికి పర్మిషన్లు తేవాలి. లాక్ డౌన్ నిబంధనల వల్ల అవి కష్టసాధ్యం అని అర్థమైంది. అందుకే మధ్యేమార్గంగా బ్యాంకాక్ లో షూటింగ్ ఫిక్స్ చేసుకుంటున్నారు.