హీరోయిన్ తమన్నా కరోనానుంచి కోలుకున్నా.. పోస్ట్ కొవిడ్ సమస్యలతో ఆమె ఇబ్బంది పడుతోందని పుకార్లు మొదలయ్యాయి. దీంతో తమన్నా మరోసారి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కేవలం వైద్యుల సూచన మేరకే తాను 10రోజులపాటు హౌమ్ ఐసోలేషన్లో ఉంటున్నానని, ఆ తర్వాత కూడా వైద్యుల అనుమతితోనే షూటింగ్ కి వస్తానని తేల్చి చెప్పింది తమన్నా. తనకి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, తన ఆరోగ్యం బాగానే ఉందని వదంతుల్ని కొట్టిపారేసింది.