రుద్రమదేవి చిత్రం విడుదలై ఐదేళ్లవుతున్న సందర్భంగా అనుష్క కూడా ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేసింది "రుద్రమదేవి ప్రయాణం నాకెంతో స్పెషల్. అల్లుఅర్జున్, రానా దగ్గుబాటి ఈ ప్రయాణాన్ని ఇంకా అద్భుతంగా మలిచారు. ఈ గొప్ప చరిత్రను వెండితెరపై ఆవిష్కరించిన గుణశేఖర్, ఆయన టీమ్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు" అని అనుష్క ట్వీట్ చేసింది.