దర్శక ధీరుడు రాజమౌళి దృష్టిలో పడటమే ప్రస్తుతం తన ముందున్న తన కోరిక అని మానుషీ చిల్లర్ చెబుతున్నారు.నేను రాజమౌళికి వీరాభిమానిని. పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ తీశారు. 'బాహుబలి', 'మగధీర' నా ఫేవరేట్ సినిమాలు. ఎన్నిసార్లైనా ఆ సినిమాలు చూస్తా. ఆయన దృష్టిలో పడేలా కష్టపడి పని చేయాలని అనుకుంటున్నాను. 'బాహుబలి' చూసి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే అటువంటి సినిమాల్లో భాగం కావాలని అనుకున్నాను. భవిష్యత్తులో అటువంటివి చేయాలని అనుకుంటున్నాను" అని మానుషీ చిల్లర్ అంటున్నది.