పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్నాడు. కానీ ఈ సినిమా షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి మరో రెండు నెలలు పవన్‌కు గ్యాప్ వచ్చేలా కనబడుతున్నది.ఈ టైమ్ ను వేరే కొత్త సినిమాకు వాడాలని పవన్ డిసైడ్ అయ్యారట. అదనపు ఆదాయం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ సినిమా ఆలస్యం అవుతుందని హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ చేస్తే పవన్ కు ఇప్పుడు రూపాయి కూడా వచ్చే అవకాశం లేదు.    ఎందుకంటే సదరు నిర్మాత పవన్‌కు రెండేళ్ల కిందటనే అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు.అందుకే వేరే కొత్త సినిమాను చేస్తే ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలోనే అయ్యప్పన్ కోషియమ్ ను ఒకె చేయాలని ప్లాన్ చేశారట.