చిన్న కూతురు చనిపోయిన విషయం గురించి గంగవ్వ చెప్పింది. ‘‘నా చిన్న కూతురుకు ఓ రోజు అర్ధరాత్రి అనారోగ్యం చేసింది. ఫిట్స్ వచ్చింది. ఆస్పత్రికి వెళ్లాక నాకు బువ్వ లేదు, బట్ట లేదు, డబ్బులు లేవు. తీరా ఉదయం లేచి చూస్తే రెండో రోజు చూస్తే చనిపోయింది. నాకు ఆ విషయం తెలియక ఓ బస్సు ఎక్కా. కండక్టర్ చనిపోయిన పిల్లను చూసి .. శవంతో ఎక్కుతున్నావ్ అన్నాడు. దీంతో బస్సు దిగేశా. ఆటోకు 100 ఇచ్చి… ఊర్లో దిగా. ఊరంతా నాకు సాయం చేశారు’’అంటూ గంగవ్వ చెబుతూ ఏడ్చేసింది.’ఇన్ని కష్టాలు పడింది కాబట్టే… గంగవ్వ ఇప్పుడు స్టార్ అయ్యింది. జీవితంలో కష్టాలు నేర్పించే పాఠాలు ఎవరూ నేర్పించరు అంటారు. అలా పాఠాలు నేర్చుకున్నవాళ్లు ఉన్నతస్థానాలకు ఎదుగుతారు అనడానికి గంగవ్వ ఓ ఉదాహరణ..