సూపర్ స్టార్ మహేష్ బాబు ‘అతిథి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఐటమ్ గర్ల్ గా అడుగుపెట్టింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంలోనూ ఐటెం సాంగ్స్ లో నర్తించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది మలైకా. ఇటీవల కాలంలో ఈమె కరోనా వైరస్ భారిన పడిన సంగతి తెలిసిందే. కొద్దిపాటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈమె వైద్యులను సంప్రదించగా వారు టెస్టులు చేసి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. దాంతో కొద్ది రోజులు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకున్న మలైకా.. ఆ తరువాత హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ వచ్చింది. ఇక ఇలా కోలుకుందో లేదో…వెంటనే తన కొత్త ఫొటోలతో సందడి చెయ్యడం మొదలుపెట్టేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిల్యానీ డిజైన్ చేసిన ఎల్లో కలర్ లెహెంగా ధరించి ఫొటోలకు పోజులిచ్చింది మలైకా.