ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ మహాభారత ఆదిపర్వంలోని ఈ ప్రేమకథను 'శాకుంతలం' పేరుతో సినిమాగా తెరకెక్కించబోతున్నారు.ఇక ఈ సినిమాలో అద్భుతసౌందర్యరాశి అయిన శకుంతల పాత్రకు ఎవరు న్యాయం చేయగలరనే చర్చ మొదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో శకుంతల పాత్రలో అనుష్కను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది. గతంలో అనుష్కతో చారిత్రక చిత్రం 'రుద్రమదేవి'ని తెరకెక్కించారు గుణశేఖర్.   దాంతో 'శకుంతల' సినిమా కోసం ఆయన అనుష్క పేరునే పరిశీలించే అవకాశముందని అంటున్నారు.