'ఆర్.ఆర్.ఆర్' సినిమా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని సంకల్పించినా లేట్ అవుతూనే వచ్చింది. దీంతో అసలు వచ్చే ఏడాదైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు అందరిలో కలిగాయి.  అయితే ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసి అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పాడు. అయితే షూటింగ్ లేట్ అవుతూ వస్తున్న కారణంగా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రెండు భాగాలుగా తీసి ఫస్ట్ పార్ట్ ని 2021 సమ్మర్ కు విడుదల చేస్తే ఎలా వుంటుందని రాజమౌళి ఆలోచన చేశారట. దీని గురించి హీరోల దగ్గర కూడా డిస్కస్ చేస్తే వారిద్దరూ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారట. రెండు భాగాలుగా ప్లాన్ చేస్తే స్టోరీ దానికి తగ్గట్లు చేంజెస్ చేయాల్సి ఉంటుందని.. దాని వల్ల ఇంకా ఎక్కువ టైమ్ పడుతుందని.. అందుకే ముందుగా అనుకున్నట్లే ఒకే సినిమాగా కంప్లీట్ చేయాలని హీరోలిద్దరూ కోరారట.