విజయ్ దేవరకొండ ఎప్పుడూ ఎనర్జిటిక్ గా కనిపిస్తుంటారు. ఆయన నిరాశపడే సందర్భం ఉందంటే ఎవరూ నమ్మరు. అయితే అలాంటి విజయ్ దేవరకొండ కూడా ఓ విషయంలో నిరాశ చెందారట. ఇటీవల కరోనా విషయంలోనే విజయ్ కాస్త నిరాశ పడ్డారట. లాక్ డౌన్ లో ఊరికే కూర్చోవడం ఆయనకు అస్సలు ఇష్టంలేదట. అయితే లాక్ డౌన్ కాలాన్ని కూడా తనకి అనుకూలంగా మార్చుకుని తన ఫిజిక్ పై దృష్టిపెట్టానంటున్నారు ఈ యువహీరో. త్వరలోనే ఫైటర్ గా ప్రేక్షకుల ముందుకొస్తానని చెబుతున్నాడు.