కరోనా కష్టకాలంలో అందరిలాగే సినిమాలకు రజినీకాంత్ కూడా దూరంగా ఉన్నారు. ఇప్పుడు అన్ లాక్ వెసులుబాట్లతో.. అన్నిచోట్లా సినిమాల షూటింగ్ సందడి మొదలైంది. అయితే రజినీ మాత్రం షూటింగ్ లకు హాజరు కాలేనని చెప్పేశారట. రజనీ ప్రస్తుతం`అన్నాతై` పేరుతో కొత్త సినిమా తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి దర్శక నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుని హీరో రజినీని సంప్రదించారట. అయితే సూపర్ స్టార్ మాత్రం తాను ఇప్పుడప్పుడే షూటింగ్ మూడ్ లోకి రాలేనని చెప్పేశారట.