మహేష్, రామ్ చరణ్, ప్రభాస్ లతో  సినిమాలు చెయ్యాలని ఓ బడా నిర్మాత తహతహలాడుతున్నాడట. ఆ నిర్మాత ఆల్రెడీ ఈ ముగ్గురి హీరోలతో సినిమాలు చేసాడు. అవి సక్సెస్ సాధించాయి కూడా.! అయితే ఇప్పుడు తెలిసిన దర్శకులను ఈ ముగ్గురి హీరోల దగ్గరకు పంపించి కథలు వినిపించే ఏర్పాట్లు చేస్తున్నాడట. అయితే అవేమి వాళ్లకు నచ్చడం లేదని తెలుస్తుంది. ఇప్పట్లో ఎలాగూ ఖాళీగా లేరు, ఓ 5ఏళ్ళు టైం పట్టినా పర్వాలేదు ఈ ముగ్గురి హీరోలను లైన్లో పెట్టి సినిమాలు ఓకే చేయించుకోవాలని ఆ నిర్మాత తపన. వాళ్లేమో పాన్ ఇండియా సినిమాలు చెయ్యాలని చూస్తున్నారని వినికిడి. ఈ నిర్మాతేమో చిన్న డైరెక్టర్లు లేదా మీడియం రేంజ్ డైరెక్టర్లనే ఎంచుకుంటాడు.