బిగ్ బాస్ దివి మహేష్ గురించి "‘మహర్షి’ సెట్లో 20 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్లు కూడా ఉండేవారు. కానీ వాళ్లంతా మహేష్ సర్ ముందు తేలిపోయేవాళ్ళు. ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకరోజు మా ఇద్దరి పై మాంటేజ్ షాట్ తీస్తున్నారు.. ఆ సమయంలో మమ్మల్నిద్దరినీ ఒకచోట నిలబెట్టి ఏదొకటి మాట్లాడుకోమన్నారు. మేం మాట్లాడుకుంటున్న ప్లేస్ లో.. గాలి గట్టిగా వచ్చింది. ఆ టైంలో మహేష్ సర్ హెయిర్ ఎగిరింది. అప్పుడు నేను ఆయన నుదురుపై ఉన్న పుట్టుమచ్చను చూశాను. వావ్ సో బ్యూటిఫుల్ సార్ అని మహేష్ సార్‌కి చెప్పా.. నా కూతురు సితారకు కూడా అదే ప్లేస్‌లో పుట్టుమచ్చ ఉంటుందని మహేష్ సర్ అన్నారు” అంటూ దివి చెప్పుకొచ్చింది.