. ‘యాక్షన్’ చిత్రీకరణ సమయంలోనే… ‘నష్టాలు వస్తే నేను భరిస్తాను’ అని నిర్మాతలకు విశాల్ మాటిచ్చాడట.అంతేకాదు అగ్రిమెంట్ పై సైన్ కూడా చేసాడట. ఇక సినిమా ఫుల్ రన్ ముగిసాక విశాల్ ను బ్యాలన్స్ అమౌంట్ కోసం నిర్మాతలు సంప్రదించగా.. తన తరువాతి చిత్రాన్ని ‘యాక్షన్’ నిర్మాతలతో చేస్తానని హామీ ఇచ్చాడట.  కానీ ఇప్పుడు సైలెంట్ గా వేరే నిర్మాతలతో తన నెక్స్ట్ సినిమా చెయ్యడానికి విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..’యాక్షన్’ నిర్మాతలు మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. కోర్టు వారు కూడా నిర్మాతలకు అనుకూలంగానే తీర్పు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక బ్యాలన్స్ అమౌంట్ అయిన రూ.8.3 కోట్లను విశాల్ ‘యాక్షన్’ నిర్మాతలకు చెల్లించాల్సి ఉంది.