ఈమధ్య మహేష్ బాబు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో కాస్త ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకుంటున్నాయి. వాస్తవానికి ఇద్దరు హీరోల అభిమానులు ఎప్పుడూ హద్దు దాటలేదు, ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోలేదు. అయితే కొత్త సినిమా వీరి అభిమానులమ ధ్య చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. త్రివిక్రమ్ ముందు మా హీరోతో సినిమా చేస్తారంటే, మా హీరోతో చేస్తారని సోషల్ మీడియాలో వార్ వార్ మొదలు పెట్టారు.