ప్రస్తుతం బోయపాటి శ్రీనుకి నిర్మాత దిల్ రాజు అడ్వాన్స్ ఇచ్చారు. బాలయ్య సినిమా తరువాత బోయపాటి చేయబోయేది దిల్ రాజుకే. అయితే హీరో ఎవరు అన్నది సమస్య. బోయపాటి దగ్గర మహేష్ బాబు కోసం ఓ కథ వుంది. దాన్ని తీసుకుని, మహేష్ ను ఒప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మహేష్ నుంచి అంత సానుకూల స్పందన అయితే రావడం లేదు. ఇతర హీరోలు కూడా బోయపాటితో సినిమా అంటే జంకుతున్నారు.