వచ్చే ఏడాది నుంచి ఏకకాలంలో రెండు చిత్రాలను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనుకుంటున్నారు చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆయన 'ఆచార్య' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్, మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్ చేయనున్నారు. ఈ రెండు చిత్రాలనూ సమాంతరంగా షూటింగ్ చేయాలని చిరంజీవి అనుకుంటున్నారనీ, జనవరిలో ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయని తెలిసింది.