ఎన్టీఆర్ ఇప్పుడు RRR సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ మూవీ చిత్రీకరణ ముగించి బయటకు వస్తేనే త్రివిక్రమ్ తో సినిమా చేయగలడు.కానీ ఈలోగానే సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ సినిమా అంటూ ప్రచారం సాగిపోతోంది.   అంటే తారక్ ని పక్కనపెట్టి త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేస్తాడా? అలా అయితే పరశురామ్ తో సినిమాని మహేష్ ముందు పూర్తి చేయడా? త్రివిక్రమ్ తో సినిమా పరశురామ్ తర్వాతేనా? ఇలా రకరకాల డౌట్లు పుట్టుకొచ్చేస్తున్నాయి.