వరుస సినిమాలతో బిజీగానే ఉన్న కాజల్ ఈ నెలలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ముంబైకి చెందిన పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబోతోంది.తాజాగా వీరికి సంబంధించిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికీ ఎప్పట్నుంచో పరిచయం ఉందని ఈ ఫొటోల ద్వారా స్పష్టమవుతోంది. వీరిద్దరూ ఎప్పట్నుంచో స్నేహితులని ఆ తర్వాత ప్రేమికులుగా మారారని సమాచారం.