‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలను లైన్లో పెడుతున్నారు. అందులో అల్లు అర్జున్ ‘పుష్ప’ అలాగే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాల షూటింగ్ ఈ పాటికే మొదలుకావాల్సి ఉంది. అయితే ఈ రెండు చిత్రాలకు ఇప్పుడు లొకేషన్ల సమస్య వచ్చి పడింది. ‘పుష్ప’ కోసం దట్టమైన అడవుల లొకేషన్ కావాలి. ఇందుకు గాను కేరళ వెళ్ళాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ కరోనా మరింత విజృంభిస్తున్న నేపధ్యంలో … సుక్కూ అండ్ టీం ఆలోచనలో పడ్డారు. ఇక మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ పరిస్ధితి కూడా అంతే..! ఈ చిత్రం షూటింగ్ కోసం తారాగణం అమెరికా వెళ్లాల్సి ఉంది. నవంబర్ నుండీ 45 రోజుల పాటు నాన్ స్టాప్ షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు యూనిట్ సభ్యులకు వీసాల సమస్య వచ్చి పడిందట. దాంతో జనవరి వరకూ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదని టాక్. ఇక ‘మైత్రి’ వారు నిర్మించిన ‘ఉప్పెన’ చిత్రం షూటింగ్ పూర్తయినా విడుదల చెయ్యలేని పరిస్ధితి. మరి వీరి సమస్యలు ఎప్పటికి తీరతాయో..!