సౌందర్య పాత్ర కోసం ముగ్గురు స్టార్ హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. వారు ఎవరంటే కీర్తి సురేష్, నిత్యా మీనన్ మరియు సాయి పల్లవి. మొదట ఈ బయోపిక్ లో జాతీయ అవార్డు గ్రహీత అయిన కీర్తి సురేష్ నటించబోతున్నట్టు తెలుస్తుంది.సౌందర్య సినీ జీవితం అలాగే ఎవ్వరికీ తెలియని ఆమె చేసిన సేవా కార్య క్రమాల గురించి ఈ బయోపిక్ లో చూపించే అవకాశం ఉందట.చెప్పాలంటే కీర్తి సురేష్ కూడా చాయిస్ అనే చెప్పాలి.ఇక పై బయోపిక్ లు చెయ్యను అని కీర్తి సురేష్ చెప్పినప్పటికీ.. సౌందర్య బయోపిక్ చెయ్యడం కోసం ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు మొన్నటి వరకూ వార్తలు వచ్చాయి. ఒకవేళ ఈమె కనుక ఒప్పుకోకపోతే నిత్యా మీనన్ ను ఎంచుకునే అవకాశం కూడా ఉందని టాక్ వచ్చింది. నిత్యా మీనన్ కూడా సౌందర్య పాత్ర కోసం ఆసక్తి గా ఎదురుచూస్తుంది. అయితే ఇండియా హెరాల్డ్ కి అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది