అక్టోబర్ 5న పునఃప్రారంభమైన ‘ఆర్ఆర్ఆర్’ షూట్‌కి కొన్ని గంటల్లో బ్రేక్ పడింది. మధ్యలో రాజమౌళి బర్త్‌డే వుందని బ్రేక్ తీసుకున్నట్టు వున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే… మళ్ళీ షూట్ స్టార్ట్ అవుతున్నది. బుధవారం నుండి తారక్, ఎన్టీఆర్, రాజమౌళి మళ్ళీ సెట్స్ మీదకు రానున్నారు. ఈసారి బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ చేస్తార్ట. అక్టోబర్ 14 నుండి షూట్ మొదలుపెట్టి నాన్ స్టాప్‌గా రెండు నెలలు కంటిన్యూ షెడ్యూల్ చెయ్యాలని ప్లాన్ చేశార్ట. మధ్యలో సండేలు బ్రేక్ తీసుకుంటే తీసుకోవచ్చని యూనిట్ వర్గాల టాక్. ఈ లాంగ్ షెడ్యూల్లో ఇద్దరు హీరోలు వుంటారు.