సోమవారం ‘క్రాక్’ షూటింగ్‌కు సంబంధించిన ఒక వర్కింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో షూటింగ్ సెట్ మొత్తాన్ని ప్రాపర్‌గా శానిటైజ్ చేయడం, ఎంట్రన్స్‌లో డిజిన్ఫెక్టెంట్ టన్నెల్‌ను ఏర్పాటు చేయడం మనం చూడొచ్చు. రవితేజ, గోపీచంద్ మలినేని సహా సెట్లో ఉన్న ప్రతి యూనిట్ మెంబర్ మాస్క్ ధరించి కనిపిస్తున్నారు. కెమెరా ముందుకు వచ్చి నటిస్తున్నప్పుడు మాత్రమే యాక్టర్లు మాస్క్‌లు తీసేస్తున్నారు. “స్టేషన్లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి దొబ్బిచ్చుకో” అని తోటి పోలీస్తో రవితేజ గట్టిగా చెబుతున్న లేటెస్ట్ డైలాగ్ సీన్ ఒకదాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఆ డైలాగ్‌తో రవితేజ క్యారెక్టరైజేషన్ ఏ రీతిలో ఉంటుందో చిత్ర బృందం మనకు హింట్ ఇస్తోంది.అలాగే తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కథలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసే రీతిలో ఆకట్టుకుంటోంది.