హీరోయిన్ కత్రినా కైఫ్ ఇప్పుడు సూపర్ గర్ల్ గా మారబోతోంది. హాలీవుడ్ రేంజ్ లో ఓ బాలీవుడ్ మూవీ చేయబోతోంది. ఈ సినిమాలో కత్రిన చేసే సాహసాలు ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. ఈ సూపర్ మేన్ మూవీని అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్నాడు. సూపర్ వుమన్ గా కత్రిన నటిస్తున్న ఈ యాక్షన్ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం దుబాయ్ లో లొకేషన్ల వేట సాగుతోంది. లొకేషన్ల వేట పూర్తయితే వెంటనే సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.