సినిమా ఫ్లాపైనప్పుడు ఒంటరిగా కూర్చుని ఏడ్చేస్తానంటోంది హీరోయిన్ పూజా హెగ్డే. "మొహంజదారో పెద్ద సినిమా, అందులోనూ హృతిక్ రోషన్ పక్కన అవకాశం అని రెండేళ్లు డేట్లు ఇచ్చా. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోయా. ఆ తర్వాత నేను తీసుకొన్న కొన్ని నిర్ణయాలు తప్పాయి. సినిమా ఫ్లాపయితే ఎవరికైనా బాధగా ఉంటుంది. అందుకు నేనేమీ మినహాయింపు కాదు. అలాంటి సమయంలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేస్తాను" అంటోంది.