బాలీవుడ్ ప్రేమ జంట అయిన రణ్‌బీర్ కపూర్, అలియా భట్ వివాహ బంధంతో త్వరలో ఒక్కటవుతారని బాలీవుడ్లో ఎప్పటినుంచో వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.      రణ్‌బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ డ్యాన్స్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో రణ్‌బీర్, అలియా మ్యారేజ్‌పై మళ్లీ చర్చ మొదలైంది. స్టార్ జంట వివాహానికి రిహార్సల్స్ కోసమే నీతూ డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారని బాలీవుడ్లో గుసగుసలు వినిపించాయి.అయితే ఇవి కేవలం ఊహాగానాలేనని కపూర్ కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు.