విజయ్ దేవరకొండ మొదటి సక్సెస్ పెళ్లి చూపులు తరహాలో సినిమా చేసి చాలా కాలమయ్యింది. కామెడీ ఎంటర్టైనర్ తరహాలో ఒక ఫుల్ మూవీ చేయాలని అనుకుంటున్నాడు. అందుకోసం తరుణ్ భాస్కర్ ని కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.   చాలా రోజులుగా ఈ కాంబినేషన్ పై అనేక రకాలుగా రూమర్స్ అయితే వస్తున్నాయి.అయితే లాక్ డౌన్ లో తరుణ్ భాస్కర్ విజయ్ కోసం రెండు విభిన్నమైన కథలను రెడీ చేయగా అందులో ఒక రొమాంటిక్ కామెడీ కథ విజయ్ కి చాలా బాగా నచ్చిందట. గీత గోవిందం తరువాత అభిమానులు ఎక్కువగా విజయ్ నుంచి అలాంటి సినిమాల్లో చూడాలని కూడా కోరుకుంటున్నారు.