సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి మంచి స్నేహితులు. 'ఓ బేబీ'తో వాళ్ళిద్దరూ మంచి విజయాన్ని అందుకున్నారు. తరవాత వీళ్ళిద్దరూ కలిసి మరో సినిమా చేస్తారని వినిపించింది. ఆ ప్రాజెక్ట్ ఇన్నాళ్ళకు పట్టాలు ఎక్కబోతుందని సమాచారం. 'ఓ బేబీ' ఫాంటసీ కామెడీ అయితే... ఇప్పుడు చేయబోయేది థ్రిల్లర్ అట. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది.