బాలీవుడ్ నటుడు గుల్షన్ వెటకారపు కామెంట్ చేసాడు. ‘మీ తలలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకో హెయిర్ కట్ ప్రిఫర్ చేస్తా’ అంటూ ఇండైరెక్ట్ గా విమర్శించాడు. ఈ కామెంట్ చూసిన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గుల్షన్ పై మండిపడ్డాడు. ‘కాస్త తెలివి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడాడో తెలుసుకుని.. అర్ధం చేసుకుని ఆ తరువాత స్పందించాలి. అంతే కానీ ఇలా ఇష్టమొచ్చినట్టు పర్సనల్ గా టార్గెట్ చేసి కామెంట్స్ చెయ్యకూడదు’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఈ కౌంటర్ కి ఆ బాలీవుడ్ నటుడికి నోట మాట రాలేదు. ఆనంద్ ఇచ్చిన ఈ కౌంటర్ దేవరకొండ ఫ్యాన్స్ బుల్లి రౌడీ ని మెచ్చుకుంటున్నారు.