వకీల్ సాబ్ తర్వాత, క్రిష్ మూవీ కోసం తీసుకున్న గ్యాప్ లో.. అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో నటించడానికి పవన్ స్టార్ ఆసక్తిగా వున్నారన్న సంగతి తెలిసిందే. ఈ మల్టీ స్టారర్ లో రానా కూడా ఉంటారని తెలుస్తోంది. ఈ సినిమాకు పవన్ నెలరోజుల కాల్షీట్లిస్తే పని పూర్తవుతుంది. అందుకే జనవరి, ఫిబ్రవరి ప్రాంతంలో ఆ మేరకు డేట్ లు ఇస్తే, నేరుగా పొలాచ్చి వెళ్లి.. పవన్ కల్యాణ్ సీన్స్ వరకు తీసుకుని వద్దామనుకుంటున్నారు నిర్మాతలు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. దర్శకుడ్ని ఫైనల్ చేసుకోకుండానే సితార లొకేషన్ల వేటలో పడిందనమాట.