లాక్ డౌన్ కాలంలో రామ్ చరణ్ కు చాలామంది దర్శకులు కథలు చెప్పినా కూడా వాటిలో దేనికీ ఆయన ఓకే చెప్పలేదు. దీనికి కారణం ఆయన భారీ సినిమాల కోసం వేచి చూడటమేనని తెలుస్తోంది. రాజమౌళి తీసే ఆర్ఆర్ఆర్ తో ఎలాగూ దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతుంది, ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలే తీస్తే ఆ మార్కెట్ ని నిలుపుకొనే అవకాశం ఉంటుంది. అందుకే పాన్ ఇండియా సినిమాలే చేయాలనే పట్టుదలతో ఉన్నారు చరణ్.